అసైన్డ్ భూముల అమ్మకాలు రద్దు.. జగన్ సంచలనం.. - MicTv.in - Telugu News
mictv telugu

అసైన్డ్ భూముల అమ్మకాలు రద్దు.. జగన్ సంచలనం..

December 11, 2019

Ap jagan mohan reddy.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజధాని భూముల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంతం కోసం సేకరించిన అసైన్డ్ భూములకు సంబంధించిన అమ్మకాలను రద్దు చేయాలని కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు నివాస, వాణిజ్య ప్లాట్ల కేటాయింపును రద్దు చేసి, అసలైన లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించింది. నాటి టీడీపీ ప్రభుత్వం అసైన్డ్‌ ల్యాండ్స్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌)–1977 చట్టాన్ని ఉల్లంఘించినట్లు కేబినెట్ అభిప్రాయపడింది. కేబినెట్ నిర్ణయంతో అసైన్డ్  భూముల అసలు లబ్ధిదారులకు ఊరట లభించింది. వాటిని కొనుక్కున్న వాళ్లకు సమస్యలు ఎదురుకానున్నాయి. 

ఏం జరుగుతుంది?

2016  ఫిబ్రవరి 17న జారీ చేసిన జీఓఎంఎస్‌ –41 కింద సేకరించిన అసైన్డ్‌ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపులు ఉండవు. సీఆర్‌డీఏ పరిధిలోని దాదాపు 2,500 ఎకరాల అసైన్డ్ భూములపై వాటి యజమానులైన బడుగువర్గాలకే హక్కులు దక్కుతాయి. రాజధాని వస్తుందని టీడీపీ నేతలు పెద్దసంఖ్యలో అసైన్డ్ భూములు కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.