ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తా: కృష్ణయ్య - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తా: కృష్ణయ్య

December 2, 2017

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై బీసీలు కన్నెర్రజేస్తున్నారు. ఏపీలో విధ్వంసానికి పాల్పడుతున్నారు. దీనిపై బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే  ఆర్‌.కృష్ణయ్య  కూడా ఘాటుగా స్పందిచారు.  కాపులను బీసీల్లో చేర్చితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇది అన్యాయం. బీసీల ప్రయోజనాలకు దెబ్బ. మేం  న్యాయపోరాటానికి సిద్ధం’ అని అన్నారు. ఈ పోరాటం కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. కాపులకు కోటా కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. మంజునాథ కమిషన్ చేసిన సిఫారసుల ఆధారంగా కాపులను బీసీ (ఎఫ్) గా పేర్కొంటూ 5 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపింది.