AP leaders ready to join BRS party
mictv telugu

కేసీఆర్ పార్టీలో చేరడానికి సిద్ధమైన ఏపీ నాయకులు

January 1, 2023

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని బలో పేతం చేసే విధంగా పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దేశంలోని పలువురు కీలక నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. ముందుగా తెలంగాణ పొరుగు రాష్ట్రాలైనా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకపై బీఆర్ఎస్ ఫోకస్ చేస్తుంది. ఆయా రాష్ట్రల్లో బీఆర్ఎస్ పనులు మొదలు పెట్టేసింది. ఈ క్రమంలోనే జనవరి 2న ఏపీకి చెందిన పలువురు నేతలు బీఆర్ ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ IAS అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబుతో పాటు మాజీ బ్యూరోక్రాట్లు, నాయకులు కూడా బీఆర్ఎస్‌లో చేరుతారని సమాచారం. వీరందరూ కేసీఆర్ చేతుల మీదగా పార్టీ కండువా కప్పుకోనున్నారు. బీఆర్ఎస్‌ ఏపీ అధ్యక్షుడిగా మాజీ IAS తోట చంద్రశేఖర్ నియమిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. కాపు సామాజిక వర్గానికి తోట చంద్రశేఖర్ . 2014లో ఏలూరు లోక్ సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. ఇక ఏపీ వ్యవహారాలు అన్నీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూసుకుంటున్నారు.