మండలి రద్దు‌పై కీలక చర్చ.. సభకు టీడీపీ దూరం - MicTv.in - Telugu News
mictv telugu

మండలి రద్దు‌పై కీలక చర్చ.. సభకు టీడీపీ దూరం

January 27, 2020

GFYTF

ఏపీలో శాసన మండలి ఉండాలా లేదా అనేది నేడు తేలిపోయే అవకాశం ఉంది. అసెంబ్లీలో కీలక చర్చ తర్వాత ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.  ముందుగా దీనిప కేబినెట్ సమావేశపరిచి దానిపై చర్చించనున్నారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ పెద్దలు రద్దు వైపు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు చర్చ ప్రారంభించి ఆ తర్వాత బిల్లు ప్రవేశపెట్టానున్నారు. బిల్లు ఆమోదం పొందిన వెంటనే కేంద్రానికి పంపించనున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో తాము సభకు హాజరయ్యేది లేదని స్పష్టం చేసింది. మండలిపై శాసన సభలో చర్చించడం అసెంబ్లీలో చర్చించడాన్ని తప్పుబడుతోంది. తమ ఎమ్మెల్యేలు ఎవరూ ఈ చర్చలో పాల్గొనకూడదని ఆ పార్టీ నిర్ణయించింది. దీంతో విపక్షం లేకుండానే మండలి రద్దుపై అసెంబ్లీలో చర్చ కొనసాగనుంది. ఎవరు వచ్చినా రాకున్నా జగన్ మాత్రం రద్దుకే మొగ్గు చూపుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

కాగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో శాసన మండల్లు లేవు. ఈ అస్త్రాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వద్ద తమ తీర్మానాన్ని ఆమోదించుకునే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ నుంచి ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ మండలి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ వారు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తామని ప్రకటించడంతో ఈ రోజు సమావేశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.