ఏపీ మగాళ్లు అందులో టాప్.. ఒక్కొక్కరికి నలుగురితో ఎఫైర్స్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ మగాళ్లు అందులో టాప్.. ఒక్కొక్కరికి నలుగురితో ఎఫైర్స్

May 17, 2022

 

జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ చేపట్టిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఒక్కొక్క పురుషుడు ఒకరి నుంచి ముగ్గురు మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని అధికారులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 2020-21 మధ్య 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై నేషనల్ హెల్త్ ఫ్యామిలీ రెండో విడత సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఉత్తరాదిలో కంటే దక్షిణాదిలోనే లైంగిక సంబంధాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.

దక్షిణాదిలో ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఉన్నాయి. మగవారిలో.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మగాళ్లు ముందున్నారు. ఏపీలో మాత్రం ఒక్కో అబ్బాయి తనకు ఒకటి నుంచి నలుగురుతో లైంగిక సంబంధాలు ఉన్నాయని ఒప్పుకున్నారు. తెలంగాణలో.. ఒక్కో పురుషుడు ముగ్గురితో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు ఒప్పుకున్నారు. ఏపీలో మహిళలతో పోలిస్తే, పురుషులే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు. జీవిత కాలంలో ఎంతమంది లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉన్నారనే ప్రశ్నకు.. మహిళల సగటు 1.4గా ఉంటే పురుషుల సగటు 4.7గా ఉంది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే ఏపీలోనే పురుషులకు ఎక్కువ మంది స్త్రీలతో సంబంధాలు ఉన్నాయి. కర్ణాటకలో పురుషులు 2.7, అండమాన్ నికోబార్‌లో 2.8, కేరళ, లక్షద్వీప్‌లో ఒక్కరితోనే లైంగిక సంబంధం, పుదుచ్చేరిలో 1.2గా, తమిళనాడులో 1.8గా నమోదైంది.