జూ. ఎన్టీఆర్‌‌పై అంబటి సటైర్.. కాంబాబు - సుకన్య అంటున్న ఫ్యాన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

జూ. ఎన్టీఆర్‌‌పై అంబటి సటైర్.. కాంబాబు – సుకన్య అంటున్న ఫ్యాన్స్

May 24, 2022

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్‌ను ఉద్దేశించి.. జూనియర్ ఎన్టీఆర్ .. బోనియర్ ఎన్టీఆర్ అంటూ కామెంట్ చేయడంపై తారక్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మంత్రి నోటి దురుసుకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మెల్సీ అనంతబాబు వివాదం గురించి మీడియాలో మాట్లాడిన అంబటి.. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు, లోకేష్ అని, ఇది టీడీపీ నేతలే అంటున్నారన్నారు. జగన్‌ను ఎదుర్కోవ‌డం ఎవ‌రి వ‌ల్ల కాదని.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, బోనియ‌ర్ ఎన్టీఆర్ వ‌స్తే బాగుండ‌ని టీడీపీ నేత‌లు అనుకుంటున్నారంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఎన్టీఆర్ ను అవమానించేలా అంబటి మాట్లాడారని, అందుకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియా వేదికగా #JaganShouldApologizeJrNTR అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేస్తూ ట్రెండింగ్ లో నిలిచేలా ట్రోల్స్, ట్వీట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఫ్యాన్స్.. అంబటి రాంబాబును కాంబాబు, సుకన్య అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.