చేపల వేటకు వెళ్లిన వైసీపీ మంత్రి  - MicTv.in - Telugu News
mictv telugu

చేపల వేటకు వెళ్లిన వైసీపీ మంత్రి 

October 27, 2020

Dasra

ఎప్పుడూ అధికారుల సమీక్షలు, ఫైల్‌పై సంతకాలతో బిజీగా గడిపే మంత్రులు అప్పుడప్పుడు సరదా యాత్రలు కూడా చేస్తారు. కొందరు వ్యవసాయం చేయడం, ఇంకొందరు వారి వారి వృత్తిని చేస్తారు. తాజాగా ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు కూడా ఇలాగే చేశారు. తన కుల వృత్తి అయిన చేపలవేటకు వెళ్లారు. దసరా సందర్భంగా కుటుంబ సభ్యులు, బాల్య స్నేహితులతో వజ్రపుకొత్తూరు మండలంలోని ఆయన స్వగ్రామం దేవునల్తాడలో గడిపారు. 

తన సోదరుడు సీదిరి చిరంజీవి చేపల వేట సాగించే బోటుపై సముద్రంలోకి వెళ్లారు. వలలు వేసి చేపలను పట్టి దాదాపు 30 పనాల వరకు చేపను ఒడ్డుకు తీసుకువచ్చారు. అక్కడే భోజనాలు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మత్స్యకారులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత తాను ఇలా చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తన చిన్నతనంలో విద్యాభాసం అంతా అక్కడే జరిగిందని తెలిపారు.