Ap Minister Gudivada Amarnath Counter To Pawan Kalyan Comments On Janasena Yuvashakathi
mictv telugu

ఆంబోతు రంకేసినట్లుగా పవన్ స్పీచ్.. వైసీపీ మంత్రి కౌంటర్

January 13, 2023

Ap Minister Gudivada Amarnath Counter To Pawan Kalyan Comments On Janasena Yuvashakathi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , వైసీపీ మంత్రుల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన యువశక్తి సభలో మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్.. పేరు పేరునా అందరి పైనా విమర్శలు చేశారు.. అయితే పవన్ కు అదే స్థాయిలో రాష్ట్ర మంత్రులు కౌంటర్‌ ఎటాక్‌ చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌కు మంత్రి రోజా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. రెండుసార్లు గెలిచిన తాను.. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ తో తిట్టించుకోవాలా అని మండిపడ్డారు. తూ.. ప్రజల కోసం తప్పట్లేదంటూ ట్వీట్‌ చేశారు. ప్యాకేజ్ స్టార్ అంటూ హాష్ ట్యాగ్ చేశారు.

మరోవైపు, మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పవన్‌పై విమర్శలు గుప్పించారు. తనకు తెలిసింది పోరాటమే.. ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణమే అన్నారు. క్యా బాత్‌ హై అని పవన్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. మొత్తానికి పవన్ నిజం ఒప్పుకున్నారని.. ఆయన ఓడిపోతున్నారని ముందే తెలుసుకున్నారు అంటూ మంత్రి అమర్ నాథ్ సెటైర్లు వేశారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం తప్పదనే విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ ముందే ఒప్పేసుకున్నారంటూ కామెంట్స్ చేశారు. ఐటీ శాఖ మంత్రి పేరు తెలియదు.. కనీసం భార్యల పేర్లైనా గుర్తున్నాయా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్ల పేర్లు గుర్తుపెట్టుకోవాలి కదా.. బహుశా ప్యాకేజీ ఇచ్చిన చంద్రబాబు పేరు మినహా ఎవరి పేరు గుర్తుండదేమో అన్నారు.

పవన్ కళ్యాణ్ ఉన్న 175 నియోజకవర్గాల పేర్లు చెబితే తాను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను అన్నారు. ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై నోటికొచ్చినట్లు మాట్లాడారని.. సీఎంను కొడతానన్నారని.. చెప్పుతో కొట్టాలన్నారని.. తమకు చెప్పులు, చేతులు లేవా అన్నారు. కాపు కులాన్నంతా మూట కట్టి తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టేద్దామనే ఆలోచన ఏమో.. వైఎస్సార్‌సీపీ తప్ప బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీతో పాటు అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాని పవన్ పై విమర్శలు చేశారు. తన పార్టీకి జనసేన పేరు మార్చేసి చంద్రసేన అని పేరు పెట్టుకోమన్నారు.