AP Minister Roja Birthday Wishes To Kodali Nani
mictv telugu

‘హ్యాపీ బర్త్ డే అన్నయ్యా’.. కొడాలి నానికి మంత్రి రోజా విషెస్

October 23, 2022

శనివారం నాడు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని పుట్టినరోజు . ఈ సందర్భంగా మంత్రి రోజా స్పెషల్‌గా విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే కొడాలి నాని అన్నయ్యా’ అంటూ సోషల్ మీడియాలో మంత్రి రోజా పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ‘నీ అంత మంచి వ్యక్తులు మరెవ్వరూ ఉండరు బ్రదర్. నువ్వు విలక్షణమైన వ్యక్తివి, అద్భుతమైన వ్యక్తిత్వం నీ సొంతం’ అంటూ కొడాలి నానిపై మంత్రి రోజా ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, కొడాలి నానితో దిగిన సెల్ఫీని కూడా ఆమె పోస్ట్ చేశారు.

 

ఏపీలో వైసీపీ అధికారం చేపట్టగానే కొడాలి నానికి సీఎం జగన్ పౌర సరఫరాల శాఖ అప్పగించారు. దాదాపు మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. అయితే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కొడాలి నానికి మరోసారి మంత్రిగా అవకాశం లభించలేదు. అటు నగరి ఎమ్మెల్యే రోజా మంత్రి వర్గ విస్తరణలో టూరిజం మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. కొడాలి నాని, రోజా ఇద్దరూ నేతలు గతంలో టీడీపీలో కలిసి పనిచేసి ఇప్పుడు వైసీపీలో కొనసాగుతుండటం గమనించదగ్గ విషయం.