Ap Minister Roja Counters Janasena Party Chief Pawan Kalyan Comments
mictv telugu

ముందు సర్పంచ్‌లుగా గెలవండి.. పవన్‌కు మంత్రి రోజా సవాల్

September 19, 2022

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్‌ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. సినిమా పిచ్చి ఉన్నవాళ్లే పవన్‌ మీటింగ్‌లకు వస్తున్నారని చెప్పారు. పవన్‌కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. జనసేనకు 175 స్థానాల్లో అభ్యర్థులే లేరు కానీ.. అసెంబ్లీ జెండా ఎగురవేస్తారట అంటూ ఎద్దేవా చేశారు. ముందు సర్పంచ్‌లుగా గెలవండి.. తర్వాత ఎమ్మెల్యేల గురించి ఆలోచించడని చురకలంటించారు.

పవన్‌.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదన్నారు రోజా. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ నుంచి పారిపోయి కరకట్టలో దాక్కున్న చంద్రబాబును పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ప్యాకేజీలు తీసుకుని వేరే పార్టీలకు ఓటు వేయమని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని సెటైర్లు పేల్చారు. ఎన్టీఆర్‌, చిరంజీవి పార్టీ పెట్టి సింగిల్‌గా పోటీచేస్తే.. పవన్‌ మాత్రం 2014లో ప్యాకేజీకి ఆశపడ్డారని విమర్శించారు. ప్యాకేజీల కోసమే పవన్‌ విమర్శలు చేస్తున్నారని.. పవన్‌ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమే అంటూ ధ్వజమెత్తారు.