చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని మొన్న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. రజనీ తెలంగాణకు చెందిన వారు కావడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రజనీ తండ్రి రాగుల సత్తయ్య తెలగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందినవారు. నాలుగు దశాబ్దాల క్రితం మెరుగైన ఉపాధికోసం హైదరాబాదుకు వెళ్లి సఫిల్ గూడలో ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. విడదల రజని రెండో కుమార్తె. ఈమెను ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తకు ఇచ్చి వివాహం జరిపించారు. కాగా, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిన వెంటనే కొండాపురం గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.