AP Mp Raghu Rama Krishna Raju Pays Tribute On Ysr Death Anniversary
mictv telugu

మనసున్న మహారాజు.. ఎమోషనల్ అయిన రఘురామకృష్ణ రాజు

September 2, 2022

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి నేడు. ఆ మహానేతకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. సంక్షేమ పథకాల సారధి, మనసున్న మారాజు అంటూ గుర్తు చేసుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ వర్థంతి సందర్భంగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ‘మనసున్న మహారాజు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వై.యస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహ నాయకుడికి నా ఘన నివాళులు’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.