AP: Name the bus..win a prize
mictv telugu

ఏపీ: బస్సు పేరు చెప్పండి..బహుమతి గెలుచుకోండి

July 20, 2022

ఆంధ్రప్రదేశ్‌లో రవాణాశాఖ అధికారులు ‘బస్సు పేరు చెప్పండి- బహుమతి గెలుచుకోండి’ అనే పేరుతో ఓ ఆఫర్‌ను ప్రకటించారు. ”ఎందుకంటే..ఏపీఎస్ ఆర్టీసీ త్వరలోనే దూర ప్రాంత ప్రయాణికుల కోసం కొత్తగా నాన్ ఎసీ స్పీపర్ బస్సులను ప్రవేశపెడుతోంది. ఒక్కో బస్సులో 30 బెర్తులు, ప్రతి బెర్త్‌కు ఫ్యాన్, రీడింగ్ ల్యాంప్ ఉంటాయి. ఈ బస్సులకు మంచి పేరు పెట్టాలని ఆర్టీసీ కోరుతోంది. బ్రాండ్ ఇమేజ్‌ పెరిగేలా పేరు సూచించిన వారికి బహుమతి అందిస్తాం” అని ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు మంగళవారం తెలిపారు.

కావున బస్సు పేరును సూచించేవారు ఈ నెల 24 లోగా [email protected]కు పంపించాలని ఆయన తెలిపారు. ఎవరైతే మంచి పేరును సూచిస్తారో ఆ ఉద్యోగులకు అవార్డు, ప్రజలకు నగదు రివార్డు ఇస్తామని అన్నారు. మరి ఎందుకు ఆలస్యం.. వెంటనే ఓ మంచి పేరును ఆలోచించండి.. క్యాష్ ప్రైజ్‌ను గెలుచుకోండి.