Home > Featured > ఏపీ: నేటి నుంచే కొత్త పేస్కేల్..ఏడాదికి రూ.3,600 కోట్లు

ఏపీ: నేటి నుంచే కొత్త పేస్కేల్..ఏడాదికి రూ.3,600 కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న 52 వేల మందికి జగన్ మోహన్ రెడ్డి ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రజా రవాణా విభాగం ఉద్యోగులకు నేటి (అక్టోబరు 1) నుంచి ప్రభుత్వ పేస్కేల్ ప్రకారమే జీతాలు చెల్లించనున్నామని ఓ గతరాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

విడుదల చేసిన ప్రకటనలో.."ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేరుస్తున్నాం. ఆర్టీసీని గతంలోనే ప్రభుత్వంలో విలీనం చేశాం. దీంతో ఆర్టీసీపై ఉద్యోగుల జీతాల చెల్లింపు భారం తొలగిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వ పేస్కేల్‌ను కూడా వర్తింపజేస్తుంది. ఈ పేస్కేల్‌తో దాదాపు 52 వేల మంది ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. పేస్కేల్ నిమిత్తం ఆర్టీసీ ఉద్యోగుల కేడర్‌ను కూడా ఇప్పటికే ఖరారు చేశాం" అని పేర్కొన్నారు.

ఏపీలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..ఆర్టీసీని 2020 జనవరి 1 నుంచి ప్రభుత్వంలో విలీనం చేసింది. అప్పటి నుంచి దాదాపు 52 వేల మంది ఉద్యోగుల జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకు ప్రభుత్వం నెలకు రూ.300 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,600 కోట్లు వెచ్చించింది.
ఇలా ఇప్పటికి రెండేళ్ల 9 నెలల్లో రూ.9,900 కోట్లను ప్రభుత్వం జీతాల కింద చెల్లించింది. ప్రభుత్వ కొత్త పేస్కేల్ ప్రకారం జీతాల చెల్లింపుతో సర్కారుపై ఏడాదికి రూ.300 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలియజేశారు.

Updated : 30 Sep 2022 9:59 PM GMT
Tags:    
Next Story
Share it
Top