AP: New policy from tomorrow..even a minute late
mictv telugu

ఏపీ: రేపటి నుంచి కొత్త విధానం..నిమిషం ఆలస్యమైనా

August 15, 2022

AP: New policy from tomorrow..even a minute late

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నవారికి రేపటి నుంచి కొత్త హాజరు విధానం అమలుకాబోతున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. ఇప్పటి వరకు ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ హాజరు విధానం స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీని కోసం ‘సిమ్స్‌-ఏపీ’ అనే మొబైల్‌ యాప్‌ను రూపొందించామని, ఉపాధ్యాయులు సహా పాఠశాలల్లో పనిచేసే అందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఓ నిబంధన విధిస్తూ, ప్రకటన విడుదల చేశారు.

”తొలుత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అతడి లాగిన్‌లో పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు నమోదు చేయాలి. వారికి ఎన్ని సెలవులు ఉన్నాయో కూడా అందులో పేర్కొనాలి. అనంతరం వారి ఫొటోలను మూడు యాంగిల్స్‌లో తీసి, యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత వారు పాఠశాలకు వచ్చిన వెంటనే యాప్‌లో లాగిన్ అయి ఫొటో తీసుకుని అప్‌లోడ్ చేయాలి. అది కూడా ఉదయం 9 గంటలలోపే చేయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా యాప్ అంగీకరించదు. ఫలితంగా ఆబ్సెంట్ పడుతుంది. కాబట్టి లీవ్ పెట్టకోవాలని సూచిస్తుంది. అలాగే, ఎక్కడున్నా 9 గంటలలోపు ఫొటో తీసుకుని అప్‌లోడ్ చేస్తామంటే కుదరదు. జీపీఎస్ ఆధారంగా ప్రతి పాఠశాలను గుర్తిస్తారు. కాబట్టి పాఠశాల ఆవరణలోనే ఫొటో తీసుకోవాలి. అంటే, ఉపాధ్యాయులు కచ్చితంగా 9 గంటలలోపు స్కూల్లో ఉండాల్సిందే” అని ప్రకటనలో పేర్కొంది.

AP: New policy from tomorrow..even a minute late

అయితే, ఈ కొత్త విధానం తీసుకురావడానికి గల కారణాలు ఏమిటీ? అనే విషయాన్ని అధికారులు తెలియజేశారు. బయోమెట్రిక్ యంత్రాలు సరిగా పనిచేయకపోవడం వల్లే ఈ ‘సిమ్స్-ఏపీ’ యాప్‌ను తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ లేని ఉపాధ్యాయుల సంగతులు ఏంటీ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏజెన్సీ, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్య ఉంటుందని, అప్పుడెలా అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు ట్రాఫిక్ ఇబ్బందులు, బస్సుల ఆలస్యం వంటిసమస్యలు కూడా ఉంటాయంటున్నారు. ఈ నేపథ్యంలో సిమ్స్-ఏపీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) ఉపాధ్యాయులకు సూచించింది.

AP: New policy from tomorrow..even a minute late