AP people can file consumer forum cases from homes
mictv telugu

ఇక ఇంట్లో ఉండి కేసులు పెట్టొచ్చు.. గ్రామం నుంచి విచారణకు హాజరు కావచ్చు

November 25, 2022

AP people can file consumer forum cases from homes

ఎవరిపైన అయినా మనం కేసులు పెట్టాలంటే పోలీస్ స్టేషన్ లేదా కోర్టుకు వెళ్లాలి. కానీ ఏపీ ప్రజలు మాత్రం ఇంటి నుంచే కేసులు పెట్టవచ్చు. సొంత గ్రామం నుంచి విచారణకు హాజరు కావచ్చు. ప్రభుత్వం ఈ కొత్త వెసులుబాటును అక్కడి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా వినియోగదారుల కోసం ఈ సౌలభ్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరైనా ఎక్కడైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువు నాణ్యత బాలేకపోతే ఇంటి నుంచి కేసు వేసే కొత్త చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది.

గ్రామ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రజల ముంగిటకే సేవలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేశామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. దీని కోసం వినియోగదారుల చట్టాన్ని సవరించింది. అంతేకాక, ఫిర్యాదుల కోసం రెండు టోల్ ఫ్రీ నెంబర్లు 1967, 18004250082 ఏర్పాటు చేసింది. దీంతో పాటు ఇప్పటికే వైజాగ్ లో ఉన్న కల్తీ నిరోధక ల్యాబ్ ను విజయవాడ, తిరుపతిలలో ఏర్పాటు చేయనుంది. వినియోగదారులు దోపిడీకి గురికాకుండా కాపాడడమే ఈ కొత్త చట్టం టార్గెట్ అని మంత్రి వివరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులు, ఎరువుల షాపులు, షాపింగ్ మాల్స్ పై తనిఖీలు చేశామని, త్వరలో బంగారం షాపులను కూడా చెక్ చేస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 24న వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి పాల్గొని ఈ మేర వివరాలు వెల్లడించారు.