ఏపీ ప్రజలారా.. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు చేస్తా: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ప్రజలారా.. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు చేస్తా: జగన్

May 30, 2022

”మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి, నేటితో మూడేళ్లు పూర్తి అయింది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్క‌సారి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా” అని జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే ట్విట్ చేశారు.

 

జగన్ మోహన్ రెడ్డి మూడేండ్ల క్రితం ఇదే రోజున సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. నేటితో మూడేళ్ల ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేసిన సేవలను గుర్తు చేస్తూ, ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ సందేశం విడుద‌ల చేశారు. జగన్ మోహన్ రెడ్డి మూడేండ్ల పదవి కాలంలోనే రెండుసార్లు బెస్ట్ సీఎంగా ఇటీవలే అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.