AP POLICE CONSTABLE HALL TICKETS RELEASED
mictv telugu

ఏపీ కానిస్టేబుల్ హాల్ వికెట్లు విడుదల..ఇలా డౌన్‎లోడ్ చేసుకోవచ్చు…

January 12, 2023

AP POLICE CONSTABLE HALL TICKETS RELEASED

ఈనెల 20వ తేది సాయంత్రం 5 గంటల వరకు అఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష కోసం హాల్ వికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్‎ఆఫ్‎బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్లను పొందవచ్చు.

భ్యర్థులు slprb.ap.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకొనే అవకాశం కల్పించింది APSLPRB.

ఏపీలో కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 7వ తేదిన ముగిసింది. మొత్తం 6511 పోస్టులకు దాదాపు 5,09,579 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు గరిష్టంగా 83 మంది పోటీపడుతున్నారు. ఇందులో 411 ఎస్ఐ ఉద్యోగాలు కాగా, 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి.నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో .. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారి గరిష్ట వయోపరిమితి రెండేళ్లు సడలిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న ప్రిలిమినరీ పరీక్షనిర్వహించనున్నారు. జనవరి 12 నుంచి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ అవకాశం కల్పించింది. ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష జరగనుంది. తెంగాణలో ఈవెంట్స్ ఇటీవల ముగియగా..వాటిలో అర్హత సాధించిన వారికి మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్‌ 23 వరకూ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు.