AP Police SI Prelims Result 2023 OUT: Check Answer Key
mictv telugu

ఏపీ ఎస్సై రాత పరీక్ష ఫలితాలు విడుదల..

February 28, 2023

AP Police SI Prelims Result 2023 OUT: Check Answer Key

ఏపీలో 411 ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలను ఆ రాష్ట్ర పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1,51, 288 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరు కాగా..  38 శాతం అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. 57,923 మంది ఫిజికల్ టెస్ట్‌లకు అర్హత సాధించినట్లు తెలిసింది. ఇక ఈ ఫలితాలకు సంబంధించి OMR షీట్లను మార్చి 4వ తేదీ వరకు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఫలితాల కోసం అభ్యర్థులు APSLPRB అధికారిక వెబ్ సైట్ (https://slprb.ap.gov.in/UI/SIResults)ను సందర్శించవచ్చు.

 

కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. వీటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతిస్తారు. ఇది మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు కలిగి ఉన్న పరీక్ష. దీనిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.