జూన్ నెలాఖరు వరకు ఏపీ ప్రైవేటు బస్సులు బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

జూన్ నెలాఖరు వరకు ఏపీ ప్రైవేటు బస్సులు బంద్

May 13, 2020

AP Private Travels Bus

ఏపీ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్ నెలాఖరు వరకు తమ బస్సుల కార్యకలాపాలను కొనసాగించబోమని స్పష్టం చేశారు. కరోనా వైరస్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. దీంతో 400 బస్సుల యాజమాన్యాలు దీనికి అంగీకరిస్తూ తీర్మానం చేశాయి. లాక్‌డౌన్ కారణంగా ప్రజారవాణా ఆగిపోవడంతో మార్చిలోనే నిర్ణయించగా ఆ గడువును మరింత పెంచాయి. 

మూడు నెలల పాటు బస్సులు నడవకపోవడంతో తమకు పన్ను మినహాయింపు  కూడా ఇవ్వాలని ఇప్పటికే యాజమాన్యాలు రవాణా శాఖను కోరాయి. దీనికి గతంలోనే దరఖాస్తులు కూడా చేసుకున్నారు. తాజాగా జూన్ నెలాఖరు వరకు బస్సులు నడపబోమని దరఖాస్తు చేసుకుని త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు పొందాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటికే వివిధ ట్రావెల్స్‌కు చెందిన 800 బస్సులు ఉండగా 400 బస్సులు దీనికి దరఖాస్తు చేసుకున్నాయి.