ఏపీ రాజ్‌భవన్‌లో కలకలం.. తాజాగా మరో ఇద్దరికి కరోనా
ఏపీ రాజ్‌భవన్‌ను కరోనా నీలి నీడలు వదలడం లేదు. ఇప్పటికే నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ రాగా.. తాజాగా మరో ఇద్దరు వ్యాధి బారిన పడ్డారు. దీంతో గవర్నర్ నివాసంలో పని చేసే ఉద్యోగుల్లో కరోనా సోకిన వారి సంఖ్య 6కు చేరింది. తాజా పరిణామంతో ఒక్కసారిగా కలవరం మొదలైంది. రాజ్‌భవన్ ఉద్యోగితో పాటు అక్కడ ఉండే 108 అంబులెన్స్ డ్రైవరుకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది.
తాజా పరిణమంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ కేసుల సంఖ్య ఇంకా పెరగకుండా జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే గవర్నర్ సెక్యూరిటీ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఇద్దరు అటెండర్లకు వ్యాధి సోకగా వారిని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంతకు ముందే గవర్నర్‌తో పాటు మరో 12 మంది సిబ్బందికి టెస్టులు చేయగా.. నెగిటివ్ అని వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ తేలింది. కరోనా కోసం పనిచేస్తున్న అధికారులు, పోలీసులు, వాలంటీర్లు కూడా వైరస్ బారిన పడుతుంటంతో కలవరం మొదలైంది. రోజు రోజుకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.