AP reduced One paper in 10th class examination
mictv telugu

టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఒక పేపర్ తగ్గించిన ప్రభుత్వం

August 22, 2022

AP reduced One paper in 10th class examination

ఏపీలోని ప్రభుత్వం పదో తరగతి పరీక్షా విధానంలో కీలక మార్పులు చేసింది. టెన్త్ పరీక్షల కోసం ఇప్పటివరకు నిర్వహించిన ఏడు పేపర్లలో ఒక పేపరుని తగ్గించింది. కరోనాకు ముందు మొత్తం 11 పేపర్లు ఉండగా, లాక్ డౌన్ అనంతర పరిణామాలతో వాటిని 7కి కుదించింది.

ఇప్పుడు మరో పేపర్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా సీబీఎస్‌సీ సిలబస్ దృష్ట్యా 6 పేపర్లకే పరీక్ష నిర్వహించాలని, ఫిజికల్, బయోలాజికల్ సైన్స్‌ పేపర్లకు ఒకే పరీక్ష ఉండనుందని తెలిపింది. స్టూడెంట్స్‌పై ఒత్తిడి తగ్గించేందుకు తీసుకున్న ఈ కొత్త విధానాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. జాతీయ స్థాయిలో జరుగుతున్న విధానాన్ని అధ్యయనం చేసిన తర్వాత పరీక్షా విధానాన్ని సమూలంగా మారుస్తున్నామని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, దీని వెనుక సుదీర్ఘ కసరత్తు జరిగిందని వారు పేర్కొంటున్నారు.