నా శాఖలో అవినీతితో జనాలు చచ్చే పరిస్థితి : మంత్రి ధర్మాన - MicTv.in - Telugu News
mictv telugu

నా శాఖలో అవినీతితో జనాలు చచ్చే పరిస్థితి : మంత్రి ధర్మాన

April 20, 2022

01

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన సొంత శాఖలో ఉన్న అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా మాట్లాడుతూ మన శాఖపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. ‘మనలో కొంతమంది డబ్బుకు ఆశపడి రికార్డులను తారుమారు చేస్తున్నారు. ఒకరి ఆస్తులను మరొకరి పేర రాస్తుండడం వల్ల ప్రజలు కొట్టుకుని చచ్చే పరిస్థితి నెలకొంది. ఏసీబీ, విజిలెన్స్ డిపార్టుమెంటుల నుంచి వచ్చే నివేదికల ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను. ఇందులో తప్పేంలేదు. మ్యుటేషన్‌కు ఎక్కువ రోజులు పడుతుండడం, డిస్పోజల్స్ ఆలస్యం కావడం వంటి విషయాల్లో ముఖ్యమంత్రి జగన్‌ కూడా అసంతృప్తితో ఉన్నారు. మన శాఖకు వచ్చిన చెడ్డపేరును మంచిగా పని చేయడం ద్వారా పోగొట్టుకోవాలంటూ హితబోధ చేశారు.