AP: Road accident in Chittoor leaves three policemen dead
mictv telugu

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు పోలీసులు మృతి

July 24, 2022

ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. కారు డివైడ‌ర్ ను ఢీకొట్టి.. ప‌క్క‌రోడ్డులో ఎగిరిప‌డింది. దీంతో కారు నుజ్జునుజ్జ‌య్యింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా.. మ‌రో ఇద్దరికి తీవ్ర‌గాయాల‌య్యాయి. జిల్లాలోని పూత‌ల‌ప‌ట్టు మండ‌లం పి.కొత్త‌కోట‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ఆదివారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు పోలీసులు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. పోలీసు సిబ్బంది కర్ణాటక బెంగళూరులోని శివాజీనగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు. డ్రగ్స్ విక్రయించే ఓ వ్యాపారి చిత్తూరులో ఉన్నాడన్న సమాచారంతో.. అతడిని పట్టుకునేందుకు వెళ్తుండగా కారు డివైడర్ను ఢీకొట్టింది. మృతదేహాలను, క్షతగాత్రులను బెంగళూరుకు తరలించారు.