'ఆర్ఆర్ఆర్' టికెట్ల పెంపుకు ఏపీ సర్కార్ ఓకే - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’ టికెట్ల పెంపుకు ఏపీ సర్కార్ ఓకే

March 17, 2022

bbb

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందానికి శుభవార్త చెప్పింది. సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్ని రకాల టికెట్లపై అదనంగా రూ. 75 వరకు పది రోజుల పాటు పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జేసీలు, పోలీసులు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు దాటిన చిత్రాలకు ఇలా ప్రత్యేక టికెట్ ధరలు పెట్టుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇస్తుంది. కాగా, మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న నేపథ్యంలో గురువారం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాంచరణ్ ఫ్యాన్స్, జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు.

మరోపక్క ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైనా పాటలు అభిమానులను అలరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ అభిమానుల గుండెల్లో ఊరకలు వేయిస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.