ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లకు ప్రకటించిన సెలవుల తేదీలు మారాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం గతంలో ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. తిరిగి 17న స్కూల్స్ ప్రారంభం కావాల్సి ఉంది. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, ఉపాధ్యాయ సంఘాలు రెండు రోజులు సెలవులు పెంచాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవలను ప్రకటించింది. తిరిగి 19వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. అయితే అకడమిక్ క్యాలెండర్ చెదరకుండా ఉండేందుకు..ఏదో ఒక సెలవు రోజులు పనిచేసేలా షరుతుతో సెలవు ప్రకటిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. ఇక ఈ ఏడాది భోగి, సంక్రాంతి సెలవులు రెండో శనివారం, ఆదివారం వచ్చాయి. గతంలో సంక్రాంతికి కనీసం పది రోజుల పాటు సెలవులు ఇచ్చేవారు. ఇప్పుడు మారిన పరిస్దితుల్లో వాటిని తగ్గిస్తూ వచ్చారు.