AP: Serious road accident..Five dead on the spot
mictv telugu

ఏపీ: ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు స్పాట్ డెడ్

August 8, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను వెల్లడించారు.

”ఈ తెల్లవారుజామున మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తున్న కారు కంభం సమీపంలో ఓ లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధితులను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన అనిమిరెడ్డి (60), గురవమ్మ (60), అనంతమ్మ (55), ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24)గా గుర్తించాం. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు” అని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటన జరగడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పలువురు వాహనాదారులకు పోలీసులకు సమాచారం అందిండంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ట్రాఫిక్‌ను క్లీయర్ చేసి వాహనాలను తరలించారు.