ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రెండు, మూడు కుటుంబాలు, ఆ కుటుంబాలకు చెందిన వ్యక్తులే పరిపాలన చేయాలా, ఏ మనం చేయకూడదా అంటూ ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఫైర్ అయ్యారు. ”మీరు వస్తేనే తెలంగాణ అభివృద్ది చెందుతుంది. వందలమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వందల కంపెనీలు పెట్టగలరు. ఇక, మీరు అమెరికాను విడిచి, భారత్కు రండి అని డాక్టర్స్, పోలిటిషియన్స్, ప్రొఫెసర్స్, కోదండ రాంలాంటి వారు నాకు పర్సనల్గా ఫోన్ చేసి వేడుకుంటున్నారు” అని కేఏ పాల్ అన్నారు.