ఆ పాపంలో నేనూ భాగస్వామినే : ఏపీ స్పీకర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ పాపంలో నేనూ భాగస్వామినే : ఏపీ స్పీకర్

December 10, 2019

AP Speaker 01

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార, విపక్షాల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. వల్లభనేని వంశీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంపై విపక్ష టీడీపీ ఏకంగా స్పీకర్‌ను కూడా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఘాటుగానే స్పందించారు. సభలో సంప్రదాయాల గురించి ఎవరో చెప్పాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గతంలో ఎన్టీఆర్‌పై తాను వ్యవహరించిన తీరును గుర్తు చేసుకున్నారు. 

అప్పట్లో ఎన్టీఆర్ సభలో మాట్లాడకుండా అడ్డుకున్న పాపంలో తాను భాగస్వామినే అంటూ వ్యాఖ్యానించారు. ఆనాటి ఘటనపై తాను చాలా విచారిస్తున్నానని చెప్పారు. ఆ పనిలో భాగస్వామినైనందుకు తాను 15 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నానని అన్నారు. కాగా అసెంబ్లీని వైసీపీ కార్యాలయం అంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తనకు సభలో ఏ అధికారాలు ఎప్పుడు ఉపయోగించాలో తెలుసని స్పష్టం చేశారు.