వెంకన్నకు గడ్డం సమర్పించిన రాఘవేంద్రరావు - MicTv.in - Telugu News
mictv telugu

వెంకన్నకు గడ్డం సమర్పించిన రాఘవేంద్రరావు

April 9, 2018

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హాదా సాధించుకోవడానికి సినీ ప్రముఖులు కూడా తమవంతు యత్నాలు చేస్తున్నారు. కొందరు నిరసనల్లో పొల్గొంటున్నారు. కొందరు దేవుళ్లకు మొక్కుతున్నారు. కొందరు దీక్షలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు.. ఏపీకి హోదా రావాలంటూ సోమవారం తిరుమల వెంకన్నకు మొక్కు కింద గడ్డం సమర్పించుకున్నారు.

నలభై ఏళ్లుగా తాను గడ్డాన్ని స్వామి వారికి మొక్కు కింద సమర్పించుకుంటూ వస్తున్నాన్నారు. రాఘవేంద్రరావు మీడియాకు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటూ మొక్కు కింద ఈసారి గడ్డం ఇచ్చానని తెలిపారు. హోదాకు సంబంధించిన ఏపీ ప్రజలు త్వరలో రాష్ట్ర ప్రజలు శుభవార్త వింటారని చెప్పారు. ఆనాడు విభజన సమయంలో కేంద్రం, తర్వాత ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాఘవేంద్రరావు కోరారు.