హోదా పాట.. జెండాలను పక్కనెట్టి, గుండెలన్ని ఎక్కుపెట్టి.. - MicTv.in - Telugu News
mictv telugu

హోదా పాట.. జెండాలను పక్కనెట్టి, గుండెలన్ని ఎక్కుపెట్టి..

April 16, 2018

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. రాజకీయంగా, సాంస్కృతికంగా ఉద్యమం ముందుకు సాగిపోతోంది. పార్టీలు, సంఘాలు విభేదాలను తాత్కాలికంగా పక్కనబెట్టి హోదా కోసం పోరాడాలని అన్ని వర్గాలు నినదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని ఒక వీడియో సాంగ్‌ను రూపొందించారు.

ఈ పాటను సుద్దాల అశోక్‌తేజ రాయగా, యశ్వకృష్ణ సంగీతం అందించారు.  ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ దీన్ని నిన్న విడుదల చేశారు. ఏపీ చరిత్రను, మద్రాస్ నుంచి విడిపోయాక రాష్ట్ర  పరిస్థితి వంటి అంశాలను వివరించారు. ఏపీకి చెందిన ఎన్టీఆర్, కృష్ణ తదితరుల సినిమాల నుంచి కొన్ని క్లిప్స్ వాడారు. ‘జెండాలను పక్కనెట్టి, గుండెలన్ని ఎక్కుపెట్టి..’ అని సాగే ఈ పాటు హోదా ఉద్యమాన్ని, ఏపీ ప్రజల ఘన వారసత్వాన్ని, హోదాపై వారి ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది.