తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ మొదలైంది. నేటి నుంచే ఏపీ, తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక పదోతరగతి పరీక్షలుకు స్కూల్ విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఏపీలో టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 3 వ తేది నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6,10,000 మంది రెగ్యులర్, 55వేల మంది ప్రైవేటు విద్యార్థులు పదోతరగతి పరీక్ష రాయనున్నారు. మొత్తం 3,350 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు హాల్ టికెట్స్‌ను ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఇలా హాల్టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి..
మొదట bse.ap.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
హోం పేజీలో SSC Public Examinations 2023 – HALL TICKETS లింక్ పై క్లిక్ చేయాలి. అనంతరం రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం జిల్లా, స్కూల్ సెలక్ట్ చేయాలి. పేర్ల లిస్ట్ కనిపిస్తుంది. అక్కడ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయగానే..హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. డౌన్‌లోడ్ హాల్ టికెట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి పొందవచ్చును.