రేపు టెన్త్ ఫలితాలు.. ఈ సారి మార్కుల రూపంలో - MicTv.in - Telugu News
mictv telugu

రేపు టెన్త్ ఫలితాలు.. ఈ సారి మార్కుల రూపంలో

June 3, 2022

ఏపీలో పదో తరగతి ఫలితాలు రేపు(జూన్ 4, శనివారం) విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు డి దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడలోని ఆర్‌అండ్‌బి కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. 2019 తర్వాత కొవిడ్‌ కారణంగా రెండేళ్లు పరీక్షలు జరగలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 26 నుంచి జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,21,799 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను ఈ సారి గ్రేడ్‌లలో కాకుండా మార్కుల రూపంలో విడుదల చేయనున్నారు.