AP stands first in the country in getting investments
mictv telugu

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీకి టాప్ ప్లేస్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయంటే

September 13, 2022

ఏపీ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ జులై నెల నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఏడు నెలల వ్యవధిలో ఏపీకి రూ. 40,361 కోట్లు వచ్చినట్టు పేర్కొంది. తర్వాతి స్థానంలో సరిహద్దు రాష్ట్రమైన ఒడిషా నిలిచింది. ఆ రాష్ట్రానికి రూ. 36,828 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల వాటా దేశం మొత్తానికి చూస్తే 45 శాతం అని తేలింది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే లక్షా 71 వేల 285 కోట్ల రూపాయల మేర్ పెట్టుబడులు వచ్చాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ వివరాలు వైసీపీ శ్రేణులు, ప్రభుత్వ విభాగాల్లో ఉత్సాహం నింపాయి. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.