అంతర్జాతీయంగా తలెత్తిన పరిణామాల నేపథ్యంలో వంట నూనెల ధరలు ఆకాశాన్నంటాయి. లీటర్ వంట నూనె ధర రూ.200 వరకూ ఉండడం సామాన్యుడిపై భారాన్ని మోపుతుంది. ఇదే అదనుగా భావించి కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి తమ రాష్ట్ర ప్రజలకు వంటనూనెల ధరల సెగ నుంచి ఊరటనిస్తుంది. రైతుబజార్లు, మున్సిపల్ మార్కెట్లలో విజయ బ్రాండ్ ఔట్లెట్ల పేరుతో వంటనూనెలను అమ్ముతోంది.
ఈ విక్రయాలకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఫిబ్రవరి 12నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఔట్లెట్లలో.. లక్ష లీటర్ల వంట నూనె విక్రయాలు జరగడం విశేషం. మరోవైపు డిమాండ్‌కు అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్లు, 2వేల జనాభాపైడిన పంచాయతీల్లోనూ స్వయం సహాయక సంఘాల ద్వారా విజయ నూనెల విక్రయానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే గనక జరిగితే మరికొన్ని రోజుల పాటు వంటనూనెలు ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.