AP: Students..degree admissions schedule change
mictv telugu

ఏపీ: విద్యార్థుల్లారా..ప్రవేశాల షెడ్యూల్‌ మార్పు

August 8, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరడానికి ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధినీ, విద్యార్థులకు కన్వీనర్‌ ఆచార్య దారపురెడ్డి సూర్యచంద్రరావు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. 2022–23 విద్యా సంవత్సరం డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌‌ను మార్పు చేసినట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

”డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశం కోసం విద్యార్థులు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో ఈనెల 15 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఏదైనా సర్టిఫికెట్‌ పొందుపరచడం మరిచిపోతే, ఈ నెల 16 నుంచి 18 వరకు పెండింగ్‌ సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేసి, మరోమారు ధ్రువీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించాం. గుర్తింపు (అఫిలియేషన్‌) ఇచ్చిన కాలేజీల జాబితాను యూనివర్సిటీ అధికారులు ఈనెల 20, 21 తేదీల్లో వెబ్‌సైట్‌లో ఉంచాలి.

అనంతరం ఈ నెల 22 నుంచి 26 వరకు విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో డిగ్రీ ప్రవేశం కోసం వెబ్‌సైట్‌ ద్వారా ఎంపిక చేసుకోవాలి. 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్‌ ఒకటి, రెండో తేదీల్లో విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలి. సెప్టెంబర్‌ రెండో తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభిస్తాం” అని ఉన్నత విద్యామండలి తాజాగా షెడ్యూల్‌‌ను విడుదల చేసింది.