ఏపీ విద్యార్థుల్లారా.. నేడే విద్యాకానుక కిట్ల పంపిణీ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ విద్యార్థుల్లారా.. నేడే విద్యాకానుక కిట్ల పంపిణీ

July 5, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి పదోవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్తను చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కోసం ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యాకానుక’ పథకం కింద 47,40,421 మంది విద్యార్థులకు నేడు స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

జగనన్న స్టూడెంట్ కిట్ల పంపిణీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను విడుదల చేశారు.”ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యార్థులకు కిట్లను అందజేయడం వరుసగా ఇది మూడో ఏడాది. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమయ్యే తొలిరోజైన మంగళవారం జూలై 5న జగన్‌ చేతుల మీదుగా విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు ఇవి అందుతాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.931.02 కోట్లను ఖర్చు చేస్తోంది.” అని పేర్కొన్నారు.

మరోపక్క ఏపీలో నేటి నుంచే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సారానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ అధికారులు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్కూల్స్ తెరిచే రోజునే రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లను పూర్తి  చేసింది.