ఉక్రెయిన్ దేశంలో ఉన్న ఏపీ విద్యార్థులు సరిహద్దులకు వచ్చే ప్రయత్నాలు గాని, సహసాలు గాని ఎలాంటివి చేయొద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ అధ్యక్షుడు కృష్ణ బాబు అన్నారు. శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “శనివారం సాయంత్రం ఒక విమానం, మరొకటి రేపు తెల్లవారుజామున ఢీల్లీకి చేరుకుంటాయి. ముంబైకి వచ్చే ప్లైట్‌లో 9 మంది, ఢీల్లీకి వచ్చే ప్లైట్‌లో 13 మంది విద్యార్థుల జాబితాను కేంద్రం మాకు ఇచ్చింది. వీరిలో ఏపీకి చెందిన వారు ఎంతమంది ఉంటారనేది కచ్చితంగా చెప్పలేం. ముంబై, ఢీల్లీలో రిసెప్షను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కస్టమ్స్ ఆఫీసర్ రామకృష్ణ ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చే విద్యార్థులను రిసీవ్ చేసుకునేందుకు ఏర్పాట్లను చేయమని ఆదేశించాం” అని ఆయన తెలిపారు.
అంతేకాకుండా విద్యార్థులు ఎవరు సరిహద్దు ప్రాంతాలకు రావొద్దు, ఎక్కడి వారు అక్కడే ఉండాలి. బాంబింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న వారు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంకర్స్‌లోగానీ, ఇళ్లలోగాని ఉండటం మంచిదని సలహా ఇచ్చారు.
మరోపక్క ఇప్పటికే 219 మంది భారతీయ విద్యార్థులు ఇండియాకు చేరుకున్న విషయం తెలిసిందే.