ఏపీ: విద్యార్థుల్లారా..రెండవ శనివారాలన్నీ హాలిడేనే - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ: విద్యార్థుల్లారా..రెండవ శనివారాలన్నీ హాలిడేనే

July 7, 2022

ఆంధ్రప్రదేశ్‌లో రెండోవ శనివారం రోజున స్కూళ్లకు సెలవు ఉంటుందా లేదా అనే విషయంపై బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఓ ముఖ్యమైన విషయం తెలియజేశారు. రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరం (ఏప్రిల్ వరకు) ప్రకారం..రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లో ఉన్న అన్నీ పాఠశాలలకు రెండోవ శనివారాలన్నీ స్కూళ్లకు సెలవు దినాలుగానే ప్రకటిస్తూ, బుధవారం ఆయన ఓ సర్క్యులర్ జారీ చేశారు. జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. రెండవ శనివారాల్లో యాజమాన్యాలు ఎలాంటి తరగతులను నిర్వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.

మరోపక్క టెస్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలకు తొలి రోజున 80.29% మంది విద్యార్థులు హాజరయ్యారని పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. మొత్తం 986 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించామని, ఈ పరీక్షలకు 57,056 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 45,808 మంది హాజరైనట్టు ఆయన పేర్కొన్నారు.