ఏపీ: విద్యార్థుల్లారా.. రేపటి నుంచే పరీక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ: విద్యార్థుల్లారా.. రేపటి నుంచే పరీక్షలు

July 5, 2022

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే విడుదలైన పదోవ తరగతి పరీక్షాల ఫలితాల్లో ఫెయిలై, సప్లిమెంటరీ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం (రేపు) నుంచి అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 2021-22 పదోవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ పరీక్షలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

ఈ అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి అధికారులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో… ”హాల్ టికెట్లను ఇప్పటికే విడుదల చేశాం. ఇంకా హాల్ టికెట్లు తీసుకొని వారుంటే మీ స్కూల్స్‌కి వెళ్లి వెంటనే తీసుకోవాలి. జులై 6 నుంచి 15 వరకు పదోవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. నిర్ణయించిన తేదీల ప్రకారం ప్రతి పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కావున విద్యార్థినీ, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి” అని అధికారులు పేర్కొన్నారు.

మరోపక్క విడుదలైన టెన్త్ రిజల్ట్స్‌పై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందారు. ఉత్తీర్ణతా శాతం ఈసారి తక్కువగా రావడంతో జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దాంతో స్పందించిన జగన్.. ”పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి నెల రోజుల్లోనే మళ్లీ కంపార్ట్‌మెంట్ ఎగ్జామ్స్ పెడతాం. ఇందులో పాస్ అయిన విద్యార్థిని, విద్యార్థులను రెగ్యులర్‌గానే పరిగణిస్తాం. పదోవ తరగతి పరీక్షల్లో పాస్ అయిన వారికి కూడా బెటర్‌మెంట్ రాసుకునే సదుపాయాన్ని కల్పిసున్నాం. ఏదైనా రెండు సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్ రాసుకోవచ్చు. 49 అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారు రూ. 500 ఫీజు కట్టి రెండు సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్ రాసుకోవచ్చు” అన్నారు. ఈ క్రమంలో రేపు జరగబోయే సప్లి పరీక్షలకు దాదాపు 2,01,627ల మంది విద్యార్థులు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు.