ఏపీ విద్యార్థుల్లారా.. కొత్త కోర్సులు వచ్చేశాయి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ విద్యార్థుల్లారా.. కొత్త కోర్సులు వచ్చేశాయి

June 15, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక విషయాన్ని విద్యార్థులకు తెలియజేసింది.రాష్ట్రంలోని 20 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులను ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అప్రెంటీషితో కూడిన 11 కొత్త కోర్సులను ప్రవేశపెట్టామని, సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్స్, కళాశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ పోలా భాస్కర్ వెల్లడించారు.

కమిషనర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ.. ”కొత్త కోర్సులలో బీఏ టూరిజం, హాస్పిటాలిటీ బీబీఏ, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్, బీఎస్సీ గేమింగ్ లాంటివి ఉన్నాయి. 16 అటానమస్ కాలేజీలతో పాటు మరో నాలుగు సాధారణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. ఈ కోర్సులు చదివే వారికి పరిశ్రమల్లో అప్రెంటీషిప్ ఉంటుంది. దీనికి ప్రభుత్వం ప్రత్యేకంగా సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. అప్రెంటీషిప్ చేసే సమయంలో నెలకు రూ.7వేల నుంచి రూ.15 వేల వేతనం లభిస్తుంది. అన్ని కోర్సుల్లోనూ ప్రాథమికంగా 30 సీట్ల చొప్పున ప్రారంభిస్తున్నాం. మరో ఆరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో బ్యూటీ, వెల్నెస్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తాం” అని ఆయన అన్నారు.

ఆ పదకొండు కొత్త కోర్సులు ఇవే..