ఏపీ విద్యార్థుల్లారా.. పీజీ సెట్ నోటిఫికేషన్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ విద్యార్థుల్లారా.. పీజీ సెట్ నోటిఫికేషన్ వచ్చేసింది

June 23, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ చేయాలని ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు శుభవార్తను చెప్పారు. విశ్వ‌విద్యాల‌యాల్లో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం పీజీ సెట్-2022 నోటిఫికేష‌న్‌ను క‌డ‌ప‌ జిల్లాలో ఉన్న యోగి వేమ‌న విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సెల‌ర్ సూర్య క‌ళావ‌తి బుధ‌వారం రాత్రి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ నోటిఫికేష‌న్ ద్వారా రాష్ట్రంలోని 16 విశ్వ‌విద్యాల‌యాల్లో పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నాం. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. మొత్తం 145 కోర్సులు ఉన్నాయి. ద‌ర‌ఖాస్తుల‌ ప్రక్రియ గురువారం నుంచి మొదలై జులై 20న ముగుస్తుంది. ఆ త‌ర్వాత ఆగ‌స్టు 17 నుంచి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తాం” అని ఆమె అన్నారు. కావున విద్యార్థులకు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.