Home > విద్య & ఉద్యోగాలు > ఏపీ: విద్యార్థుల్లారా..ఈరోజు 11 గంటలకు ఫలితాలు విడుదల

ఏపీ: విద్యార్థుల్లారా..ఈరోజు 11 గంటలకు ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జులై 4 నుంచి 12వ వరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ 2022 ప్రవేశ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి అధికారులు విద్యార్ధినీ, విద్యార్థలకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. ఈరోజు 11 గంటలకు ఏపీ ఈఏపీసెట్‌ 2022 పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారని సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

"ఏపీలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 4 నుంచి 12వ వరకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షల ఫలితాలు ఈరోజు 11 గంటలకు (జులై 26) విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు విజయవాడలోని హోటల్ లెమన్ ట్రీ ప్రీమియర్‌లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల చేయనున్నాం. కావున పరీక్ష రాసిన విద్యార్ధినీ, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/లో రిజల్ట్స్ చెక్‌ చేసుకోవాలి" అని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నిర్వహించిన ఈఏపీసెట్‌ పరీక్షలకు మొత్తం 3,01,172 మంది దరఖాస్తు చేసుకోగా, 2,82,496 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఇంజినీరింగ్ పరీక్ష 1,94,752, వ్యవసాయ కోర్సు పరీక్ష 87,744 మంది రాశారు. మొదట అనంతపురంలో ఈ నెల 29న విడుదల చేయాలని భావించినా, కొన్ని అనివార్య కారణాలతో కార్యక్రమంలో మార్పు చేశారు. పూర్తిగా ఏపీ ఈఏపీసెట్‌‌ 2022లో సాధించిన ర్యాంకుల ఆధారంగానే అధికారులు ఈ ప్రవేశాలు కల్పించనున్నారు.

Updated : 25 July 2022 10:18 PM GMT
Tags:    
Next Story
Share it
Top