AP students..Supply results are here..
mictv telugu

ఏపీ విద్యార్థుల్లారా..సప్లి రిజల్ట్స్ వచ్చేశాయి..

August 30, 2022

ఆంధ్రప్రదేశ్‌‌లో ఇటీవలే జరిగిన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలకు సంబంధించి అధికారులు కాసేపటిక్రితమే ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేశామని పేర్కొన్నారు. ఇంటర్ సప్లి పరీక్షలను రాసిన విద్యార్థినీ, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్.. https://bie.ap.gov.in/ లేదా http://www.manabadi.co.in/ ఫలితాలను చెక్ చేసుకోవాలని కోరారు.

”ఈరోజు విడుదలైన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ జనరల్‌లో 35 శాతం, ఒకేషనల్‌లో 42 శాతం మంది, ఇంటర్‌ సెకండియర్‌లో జనరల్‌లో 33 శాతం, ఒకేషనల్‌లో 46 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు” అని ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో బోర్డు సెక్రటరీ ఎమ్‌.వి. శేషగిరి బాబు తెలిపారు. ఇంటర్‌ పరీక్షలను ఆగస్టు 3 నుంచి 12 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్స్‌లో జరిగాయి. ఈ క్రమంలో ఈరోజు అధికారులు సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను వెల్లడించారు.