AP: This is the tallest statue of Ambedkar in the country: Nagarjuna
mictv telugu

ఏపీ: దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాం ఇదే: నాగార్జున

September 14, 2022

భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్రిగహం ఎత్తు దాదాపు 125 అడుగులు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ ప్రాజెక్టులో భాగంగా జగన్ సర్కార్ ఈ విగ్రహ ప్రతిష్ఠాపనకు పూనుకుంది. అయితే, తాజాగా ఈ విగ్రహా ఆవిష్కరణకు సంబంధించి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, అధికారుల బృందం హర్యానా వెళ్లి అక్కడి స్టూడియోలో ఉన్న విగ్రహ నమూనాను పరిశీలించింది.

 

అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ…”దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఆవిష్కరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం స్వరాజ్ మైదాన్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. విగ్రహ నిర్మాణ పనులను ప్రతిరోజూ సమీక్షించడం జరుగుతోంది. విగ్రహ నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాల్లో ఇదే మొట్టమొదటిది” అని ఆయన అన్నారు.

ఇక, బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాం నిర్మాణ విషయానికొస్తే..స్వరాజ్‌ మైదాన్‌ పథకంలో భాగంగా విజయవాడలోని PWD మైదానంలో ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దాదాపుగా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహం పనులను చూసేందుకు హర్యానా గురుగావ్‌లోని మనేసర్‌లో ఉన్న మాథురామ్‌ స్టేడియాన్ని తాజాగా మంత్రులు సందర్శించారు. బంక మట్టితో చేసిన చేసిన అంబేద్కర్‌ విగ్రహ నమూనాను పరిశీలించారు. రాబోయే అంబేద్కర్‌ జయంతి ఏప్రిల్‌ 14 నాటికి అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి చేసి, ఆవిష్కరణ చేయాలని భావిస్తున్నారు.