AP to Telangana: Actress Divyavani meets BJP MLA etela rajender
mictv telugu

ఏపీ టు తెలంగాణ: బీజేపీ ఎమ్మెల్యేను కలసిన నటి దివ్యవాణి

September 8, 2022

ఏపీలోని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంలో యాక్టివ్‌గా ఉండే నాయకురాలు, సినీ నటి దివ్య వాణి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినీ నటులతో వరుసగా సమావేశమవుతూ తమ గెలుపు కోసం సినీ గ్లామర్ ను వాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఇటీవల జరిగిన పరిణామాలతో ఓ క్లారిటీ వచ్చింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మాజీ టీడీపీ నేత దివ్య వాణి.. బీజేపీ ఎమ్మెల్యే, జాయినింగ్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గురువారం హైదరాబాద్ షామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్లి కలిసారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానం, టీడీపీని వీడిన తర్వాత పరిణామాలను ఈటలకు వివరించారు దివ్యవాణి. ఇలా ఇద్దరిమధ్య రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరికకు సంబంధించి చర్చలు జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి.