AP tops drug smuggling: Center report
mictv telugu

మాదకద్రవ్యాల స్మగ్లింగులో అగ్రస్థానానికి ఏపీ : కేంద్రం నివేదిక

December 5, 2022

డ్రగ్స్, మత్తు పదార్ధాలు, గంజాయి, అక్రమ ఆయుధాలలో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్రం వెల్లడించింది. 18 వేల కిలోల మాదకద్రవ్యాలు, వెయ్యి కిలోల గంజాయిని ఏపీలో స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2021 – 22’ అనే నివేదిక వెలువరించింది. అంతేకాక, రూ. 97 కోట్ల విలువైన 165 టన్నుల ఎర్రచందనం పట్టుకున్నట్టు పేర్కొంది. తెలంగాణలో వెయ్యి కిలోల డ్రగ్స్, మత్తుపదార్ధాలు పట్టుబడినట్టు తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే కస్టమ్స్ విభాగం రూ. 17,394 కోట్ల డ్రగ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం రూ. 20,064 కోట్ల డ్రగ్స్, రూ. 1323 కోట్ల విలువైన గోల్డ్, ఫారిన్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నాయని నివేదిక స్పష్టం చేసింది.