ఏపీలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయని మంగళవారం పార్లమెంటులో కేంద్రం వెల్లడించింది. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హెంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహిళలపై అఘాయిత్యాలు ప్రతీ సంవత్సరం పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ విషయంలో ఏపీ బీహార్, యూపీ కంటే ముందుందని తెలిపింది. ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఏపీదే అగ్రస్థానమని వివరించింది. 2018 నుంచి 2021 మధ్య కాలంలో 4,340 అత్యాచారాలు, 8,406 ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఉదంతాలు, 18,883 సాధారణ దాడులు జరిగాయంది. శాతాల పరంగా చూస్తే అత్యాచారాలు 22 శాతం, దాడులు 15 శాతం పెరిగాయంది.