ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి బావ, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన విజయవాడలో వివిధ సంఘాలతో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మళ్లీ విశాఖలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..”ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన న్యాయం జరగడంలేదు. ఎన్నికలకు ముందు వైసీపీ విజయం కోసం కృషి చేసిన సంఘాలు ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. వాళ్ల గోడు వినేందుకే ఉత్తరాంధ్ర వచ్చాను. ఈ విషయంపై జగన్కు లేఖ రాస్తా” అని అనిల్ బ్రదర్ అన్నారు.
అంతేకాకుండా పార్టీ పెట్టాలని అన్ని సంఘాల వారు నన్ను కోరుతున్నారు. పార్టీ పెట్టడం సామాన్యమైన విషయం కాదు. అది చాలా క్లిష్టమైన విషయం. దీనిపై సుదీర్ఘంగా ఆలోచించాలి అని అన్నారు. ప్రధానంగా బీసీ వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్ వస్తోందని బ్రదర్ అనిల్ వెల్లడించారు. దీన్ని కచ్చితంగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. జగన్ను కలిసి రెండున్నరేళ్లయిందని, ఆయన అపాయింట్మెంట్ కోరడం లేదని అన్నారు.