బలహీనంగా వాయుగండం..ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు - MicTv.in - Telugu News
mictv telugu

బలహీనంగా వాయుగండం..ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు

November 23, 2022

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం బలహీనపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరంలో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తమిళనాడులోని 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా తీర ప్రాంత జిల్లాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈదురు గాలులతో తీరప్రాంతం చివురుటాకులా వణికిపోతోంది. కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక చెన్నై నగరాన్ని సైతం భారీ వర్షం ముంచెత్తింది. అల్పపీడన ప్రభావంతో మరో 48 గంటలపాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.